Nagarjuna Sagar 20 gates open: నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జునసాగర్ జలాశయంకు ఎగువ నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల వరద రావడంతో సాగర్ 20 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి, స్పిల్వ్వే ద్వారా 2లక్ష 95 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులకు ప్రస్తుత నీటిమట్టం 588.80 అడుగులుగా ఉంది.
జులై చివరి వారం నుంచి జలాశయానికి ప్రారంభమైన ప్రవాహంతో ఈనెల 11 నుంచి 26 గేట్లను ఎత్తి 18 రోజులుగా నీటి విడుదల చేపట్టారు. ఎగువ నుండి వరద ప్రవాహo కాస్త తగ్గుముఖం పట్టడంతో గేట్లు మూసి వేసిన అధికారులు మళ్లీ ప్రవాహాన్ని అంచనావేస్తూ గేట్లను ఎత్తుతూ, మూస్తూ వస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి ఇదే పరిస్థితి: శ్రీశైలం జలాశయం 10 గేట్లు 12 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 3.19 లక్షల క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చెస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 2.92 లక్షల క్యూసెక్కులు ప్రవాహం వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులుగా ఉంది.
జలాశయం పూర్తి నీటినిల్వ 215.80 టీఎంసీలు ఉండగా, ప్రస్తుత నీటినిల్వ 215.32 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి జరుగుతోంది. విద్యుదుత్పత్తి చేసి 62,529 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
నాగార్జున సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం ఇవీ చదవండి: