నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 2 లక్షల 67 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడం వల్ల 18 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి గత నెల రోజుల నుంచి వరద పోటెత్తడంతో సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి ఉంచారు.
నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం... 18 గేట్లు ఎత్తివేత - నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం
నాగార్జున సాగర్ జలాశయానికి గత నెల రోజులుగా వరద పోటెత్తుతూనే ఉంది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండడం వల్ల అధికారులు 18 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం... 18 గేట్లు ఎత్తివేత
సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 589.20 అడగులకు చేరింది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 309.65 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. సాగర్ జలాశయానికి వస్తున్న ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు.
ఇవీ చూడండి:వరద బాధితులకు రామోజీ గ్రూప్ రూ.5 కోట్ల సాయం