ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ 16 క్రస్ట్ గేట్లను 10 అడగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 2లక్షల 70 వేల క్యూసెక్కుల వరద ఎగువ నుంచి నీరు చేరుతుండగా... అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం... 16 గేట్లు ఎత్తివేత - నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద
భారీ వర్షాలతో నాగార్జున సాగర్‌కు వరద పోటెత్తింది. 16 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి 2 లక్షల 70 వేల క్యూసెక్కుల వరద ఎగువ నుంచి వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.40 అడుగులకు చేరింది.
![నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం... 16 గేట్లు ఎత్తివేత nagarjuna sagar 16 crust gates opened in nalgonda district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9158770-655-9158770-1602579318692.jpg)
సాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న ప్రవాహం... 16 గేట్లు ఎత్తివేత
జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడగులు కాగా ప్రస్తుతం 589.40 అడగులకు చేరింది. సాగర్ నీటి నిల్వ సామర్ధ్యం 312.04 టీఎంసీలకు చేరింది.
ఇదీ చదవండి:కరోనా ఇంకా ఉంది.. అలసత్వం వద్దు: మోదీ