నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి సాగర్ జలాశయానికి లక్షా 25 వేల క్యూసెక్కుల నీరు రావడం వల్ల 10 క్రస్ట్ గేట్లను ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీటిని స్పిల్ వే ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌కు మొత్తం ఇన్ ఫ్లో లక్షా 25వేల క్యూసెక్కుల వరద రావడం వల్ల అంతే మొత్తంలో ఔట్ ఫ్లోగా వెళ్తోంది.
సాగర్ 10 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల - nagarjuna sagar project
నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. 10 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. వచ్చిన వరదను వచ్చినట్లుగానే దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ 10 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
జలాశయం నీటిమట్టం 590 అడుగులకు గానూ 589.80 అడుగులకు చేరింది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 311.44టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. ప్రధాన విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 28వేల క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువల ద్వారా 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇవీ చూడండి: ఒప్పంద సేద్యంలో పంట సాగుపై కంపెనీలదే పూర్తి పెత్తనం!