MUSI PROJECT: గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు ఆరు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3209.65 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 6582.69 క్యూసెక్కులుగా ఉంది. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 640.35గా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలు. భారీ వరద వస్తుండటంతో ప్రాజెక్టు దిగువనున్న గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జాలర్లు ఎవ్వరూ వేటకు వెళ్లవద్దని సూచించారు.
MUSI PROJECT: మూసీకి పోటెత్తిన వరద.. ఆరు గేట్లు ఎత్తి నీటి విడుదల - మూసీ ప్రాజెక్ట్ తాజా వార్తలు
MUSI PROJECT: ఎడతెరిపి లేని వానలతో మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు దిగువనున్న గ్రామాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.

మూసీ ప్రాజెక్టు