నల్గొండ జిల్లా మిర్యాలగూడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట శాంతినగర్‌కు చెందిన సత్యనారాయణ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. బాధితున్ని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిర్యాలగూడలోని శాంతి నగర్‌కు చెందిన రసూల్ భార్యతో సత్యనారాయణ రెడ్డి సన్నిహితంగా ఉంటున్నాడు.
పోలీస్ స్టేషన్ ఎదురుగా వ్యక్తిపై హత్యాయత్నం - nalgonda district latest news
మిర్యాలగూడ టూటౌన్ పీఎస్ ఎదుట ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఇందుకు కారణం వివాహేతర సంబంధంగా తెలుస్తోంది. శాంతినగర్‌కు చెందిన రసూల్.. బాధితుడుపై కత్తితో దాడి చేయగా.. పీఎస్‌లోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తిపై హత్యాయత్నం
ఈ విషయమై మూడు రోజుల క్రితం పోలీసుస్టేషన్లో రసూల్ ఫిర్యాదు ఇచ్చాడు. శనివారం ఆ ఫిర్యాదు విషయమై ఇరు వర్గాలు పీఎస్‌కు వస్తుండగా సత్యనారాయణ రెడ్డిపై రసూల్ కత్తితో దాడి చేశాడు. చేతికి తీవ్రగాయం కావడం వల్ల బాధితుడు ఠాణాలోకి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:జులై వరకు మిడతల ముప్పు తప్పదు!