తెలంగాణ

telangana

ETV Bharat / state

మునుగోడుకు రూ.1500 కోట్లు ఇస్తే తెరాసలో చేరడానికీ సిద్ధం: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి - mla rajagopal reddy comments on trs

ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలపై వివక్ష కొనసాగుతోందని నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ ఆరోపించారు. తన నియోజకవర్గానికి నిధులిస్తే.. వెంటనే రాజీనామా చేస్తానని ప్రభుత్వంపై సవాల్​ చేశారు. చండూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

mla rajagopal reddy
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

By

Published : Aug 15, 2021, 10:54 AM IST

Updated : Aug 15, 2021, 11:04 AM IST

హుజూరాబాద్‌ నియోజకవర్గానికి దళిత బంధుతోపాటు అభివృద్ధి పనులకు రూ.3వేల కోట్లు ప్రకటించిన మాదిరిగానే.. తన నియోజకవర్గానికీ రూ.1,500 కోట్లు కేటాయిస్తే తక్షణమే తన పదవికి రాజీనామా చేస్తానని.. తిరిగి పోటీ కూడా చేయనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చండూరు మండలంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ఆయన శిర్థేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. నిధులిస్తానంటే తెరాసలో చేరడానికీ సిద్ధమని ఈ సందర్భంగా ఓ కార్యకర్త చేసిన వ్యాఖ్యపై స్పందించారు.

ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలను కొన్నారని, తన ఎమ్మెల్యే పదవినీ తీసుకొంటే 13 అవుతాయని తెరాసను ఉద్దేశించి రాజగోపాల్​ అన్నారు. ప్రజల కోసం వెళ్తానని, తనకు పదవి ముఖ్యం కాదని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలపై వివక్ష కొనసాగుతోందని రాజగోపాల్ ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉన్నాడన్న కారణంతో ప్రభుత్వం నిధులివ్వడం లేదని వ్యాఖ్యానించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి నిధులు తెస్తే అన్ని విధాలా సహకరిస్తానని స్పష్టం చేశారు. శంకుస్థాపనలు, ఫ్లెక్సీలపై తమ పేర్లు ముఖ్యం కాదని, అయితే ప్రొటోకాల్‌ పాటించాల్సిందేనని వెల్లడించారు. తన నియోజకవర్గంలో మంత్రి రేషన్‌ కార్డులను ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:డీపీఆర్‌కు అవసరమైన దానికంటే ఎక్కువ పని: కృష్ణా బోర్డు

Last Updated : Aug 15, 2021, 11:04 AM IST

ABOUT THE AUTHOR

...view details