తెలంగాణ

telangana

ETV Bharat / state

డబ్బు, అధికార బలంతోనే తెరాస గెలుపు: కోమటిరెడ్డి - మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి వార్తలు

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో డబ్బు, అధికార బలంతోనే తెరాస గెలిచిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా చండూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. నల్గొండ స్థానంలో తీన్మార్ మల్లన్న, హైదరాబాద్‌లో రాంచందర్ రావు నైతిక విజయం సాధించారని తెలిపారు.

munugodu mla Raj gopal reddy has been involved in many development programs in nalgonda
'డబ్బు, అధికార బలంతోనే ఎమ్మెల్సీ స్థానాల్లో తెరాస గెలుపు'

By

Published : Mar 21, 2021, 7:13 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండలో తీన్మార్ మల్లన్న, హైదరాబాద్​లో రామచందర్​రావుదే నైతిక విజయమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అధికార పార్టీ నాయకులు ప్రతి మండలంలోని ఫంక్షన్ హాళ్లో డబ్బులు పంచారని ఆరోపించారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. నల్గొండ జిల్లా చండూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో డబ్బు, అధికార బలంతోనే తెరాస గెలిచిందని రాజ్‌గోపాల్‌రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుక లేకుండా.. ప్రతిపక్ష పార్టీ లేకుండా.. కాంగ్రెస్ నాయకులను తమ పార్టీలోకి తీసుకున్నారని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు చైతన్యవంతులై కేసీఆర్ కుటుంబానికి గుణపాఠం చెబుతారన్నారు.

'డబ్బు, అధికార బలంతోనే ఎమ్మెల్సీ స్థానాల్లో తెరాస గెలుపు'

ఇదీ చూడండి: ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించేందుకు ఈసీ అనుమతి

ABOUT THE AUTHOR

...view details