తెరాసను గద్దె దించాలంటే అది భాజపాకే సాధ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పునరుద్ఘాటించారు. నాగార్జునసాగర్‌లో పోటీ చేయాలని కొన్ని రోజులుగా భాజపా నాయకులు తనను అడుగుతున్నట్లు వెల్లడించారు. తాను తిరుపతిలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. భాజపాలోకి రమ్మని ఇప్పటికీ తనను సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు.
'నాగార్జునసాగర్‌లో భాజపా తరఫున పోటీ చేయమంటున్నారు' - nagarjuna sagar election updates
నాగార్జునసాగర్‌లో భాజపా తరఫున పోటీ చేయమని ఆ పార్టీ నాయకులు తనను అడుగుతున్నట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. భాజపాలోకి రమ్మని ఇప్పటికీ తనను సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను తిరుపతిలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.
'నాగర్జునసాగర్లో భాజపా తరఫున పోటీ చేయమంటున్నారు'
పార్టీ మారటంపై తాను ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఒకవేళ భాజపా నుంచి నాగార్జునసాగర్‌లో తాను పోటీ చేస్తే... కారుకు కమలానికి మధ్యే పోటీ ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి మూడో స్థానంలో ఉంటారని రాజగోపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.