Munugode Bypoll: మునుగోడులో తెరాస, భాజపా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పోలింగ్ వేళ నియోజకవర్గంలో మరోసారి రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మర్రిగూడెం మండలంలో సిద్దిపేటకు చెందిన వ్యక్తులు ఉన్నారంటూ.. భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి చెందిన స్థానికేతరులంటూ కొందరిని బయటకు లాక్కురావటంతో.. భాజపా-తెరాస కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
మర్రిగూడెంలో ఉద్రిక్తత.. భాజపా-తెరాస కార్యకర్తల మధ్య వాగ్వాదం - nalgonda news
Munugode Bypoll godava: మునుగోడు ఉపఎన్నిక వేళ పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మర్రిగూడ మండలంలో సిద్దిపేటకు చెందిన వ్యక్తులు ఉన్నారంటూ భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి చెందిన స్థానికేతరులంటూ కొందరిని బయటకు లాక్కురావటంతో.. భాజపా, తెరాస కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
మునుగోడు ఉపఎన్నిక వేళ పలు చోట్ల ఘర్షణలు..
మర్రిగూడెం మండలం సిద్దిపేటలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన రాజగోపాల్‌రెడ్డిపై.. తెరాస కార్యకర్తలు రాళ్లతో దాడిచేశారు. అడ్డుకున్న పోలీసులపై తెరాస కార్యకర్తలు దాడి చేశారు. తోపులాటలో పోలీసు అధికారి ఒకరు కాలువలో పడ్డారు. తెరాస కార్యకర్తలు ఫూల్లుగా తాగొచ్చి.. గొడవ చేస్తున్నారని భాజపా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి: