మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గడువు నేటితో ముగిసింది. అక్టోబరు 7న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కాగా.. అక్టోబరు 14న నామినేషన్ల ప్రక్రియ ముగిసే సరికి మొత్తంగా 130 మంది అభ్యర్థులు 199 నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలనలో 47 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన 83 మంది అభ్యర్థు్ల్లో 36 మంది ఇవాళ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తంగా 47 మంది అభ్యర్థులు ఉపఎన్నిక బరిలో ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ముగిసిన మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ.. బరిలో ఎంతమందంటే..? - మునుగోడు ఉపఎన్నికల బరిలో 47 మంది అభ్యర్థులు
![ముగిసిన మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ.. బరిలో ఎంతమందంటే..? మునుగోడు ఉపఎన్నికల బరిలో 47 మంది అభ్యర్థులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16670973-293-16670973-1666021211157.jpg)
మునుగోడు ఉపఎన్నికల బరిలో 47 మంది అభ్యర్థులు
16:22 October 17
మునుగోడు ఉపఎన్నికల బరిలో 47 మంది అభ్యర్థులు
Last Updated : Oct 17, 2022, 9:14 PM IST