తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎన్నికల తర్వాత ఆస్ట్రేలియా వెళ్లడానికి రాజగోపాల్​రెడ్డి సిద్ధమైపోయారు'

Palvai Sravanthi on Rajagopal Reddy: కాంగ్రెస్​ పార్టీపై ఉన్న అభిమానంతో రాజగోపాల్​రెడ్డిని గెలిపిస్తే.. ఆయన తన స్వార్థ ప్రయోజనాల కోసం భాజపాలో చేరిపోయారని మునుగోడు కాంగ్రెస్​ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆరోపించారు. హైదరాబాద్​లో ఉన్న మునుగోడు ఓటర్ల ఆత్మీయ సమ్మేళంలో పాల్గొన్న ఆమె.. భాజపా స్వార్థ ప్రయోజనాల కోసం చిన్న పిల్లలను మత్తులో ముంచుతోందని విమర్శించారు.

Palvai Sravanti
Palvai Sravanti

By

Published : Oct 30, 2022, 6:46 PM IST

Palvai Sravanthi on Rajagopal Reddy: మునుగోడులో కాంగ్రెస్​ పార్టీ గెలుపు 2024 ఎన్నికలకు తొలి మెట్టు కావాలని మునుగోడు కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్​ మున్సిపాలిటీ పరిధిలోని ఓ గార్డెన్​లో హైదరాబాద్​లో ఉన్న మునుగోడు ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆమె.. భాజపాపై తన దైన శైలిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్​పై ప్రజలకు ఉన్న అభిమానంతో కార్యకర్తలు డబ్బులు ఖర్చు పెట్టి.. రాజగోపాల్​రెడ్డిని గెలిపిస్తే ఆయన భాజపాలో చేరిపోయారని విమర్శించారు.

మునుగోడు ఎన్నికల అనంతరం రాజగోపాల్​రెడ్డి ఆస్ట్రేలియా వెళ్లిపోవడానికి సిద్దమయ్యారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్​ నేతలు మునుగోడులో ప్రచారం చేస్తుంటే.. వారిపై దాడులకు పాల్పడుతున్నారని, వారి ప్రచార వాహనాలు అడ్డుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా స్వార్థ ప్రయోజనాల కోసం చిన్నపిల్లలను మత్తులో ముంచుతోందని.. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచుతున్నారని మండిపడ్డారు.

మరోవైపు తెరాస అధికార బలంతో మునుగోడులో ముందుకు వెళ్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఒక ఆడబిడ్డనైనా.. కాంగ్రెస్ పార్టీ ఎంతో నమ్మకంతో తనను పోటీలో నిలబెట్టిందని.. మునుగోడు ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్య అని పేర్కొన్నారు. మునుగోడు ప్రతి ఓటరు కాంగ్రెస్​కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

"కాంగ్రెస్​పై ప్రజలకు ఉన్న అభిమానంతో కార్యకర్తలు వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజగోపాల్​రెడ్డిని గెలిపించారు. ఆయన తన స్వార్థ ప్రయోజనాల కోసం భాజపాలో చేరిపోయారు. మునుగోడు ఎన్నికల అనంతరం రాజగోపాల్​ రెడ్డి ఆస్ట్రేలియా వెళ్లిపోవడానికి సిద్దమైపోయారు. కాంగ్రెస్​ నేతలు మునుగోడులో ప్రచారం చేస్తుంటే.. వారిపై దాడులకు పాల్పడుతున్నారు. వారి ప్రచార వాహనాలు అడ్డుకుంటున్నారు. ఇది చాలా బాధకరమైన విషయం".- పాల్వాయి స్రవంతి, మునుగోడు కాంగ్రెస్​ అభ్యర్థి

"మునుగోడు ఎన్నిక అనంతరం రాజగోపాలరెడ్డి ఆస్ట్రేలియా వెళ్లిపోతారు"

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details