తెలంగాణ

telangana

ETV Bharat / state

LIVE VIDEO: వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన మట్టి వంతెన - telangana varthalu

ఇటీవల కురుస్తున భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో చెరువులు అలుగులు దూకుతున్నాయి. నల్గొండ జిల్లా ఊట్కూరులో మట్టి వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. శిథిలావస్థకు చేరిన వంతెనకు ప్రత్యామ్నాయంగా దీనిని నిర్మించగా.. ఇప్పుడు ఇది కూడా కొట్టుకుపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

LIVE VIDEO: వరదప్రవాహానికి కొట్టుకుపోయిన మట్టి వంతెన
LIVE VIDEO: వరదప్రవాహానికి కొట్టుకుపోయిన మట్టి వంతెన

By

Published : Aug 29, 2021, 7:38 PM IST

LIVE VIDEO: వరదప్రవాహానికి కొట్టుకుపోయిన మట్టి వంతెన

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఊట్కూరు గ్రామంలో మట్టి వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. గతంలో ఉన్న పాత వంతెనకు గుంతలు పడి అది ప్రమాదకరంగా మారడం వల్ల ఊట్కూరు నుంచి నందికొండవారి గూడెం, ఎర్రబెల్లి, ముప్పారం గ్రామాలకు వెళ్లడం కోసం ఈ మట్టి వంతెన నిర్మాణాన్ని చేపట్టారు.

నాగార్జున సాగర్​ ఉపఎన్నికల సమయంలో శిథిలావస్థకు చేరిన పాత వంతెనకు ప్రత్యామ్నాయంగా, రాకపోకల రద్దీని తట్టుకునే సామర్థ్యం పాత వంతెనకు లేకపోవడం వల్ల దాని పక్కనే ఈ మట్టి వంతెనను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లోకసముద్రం చెరువు నీరు అలుగు పోస్తుండటంతో ఆ ప్రవాహానికి మట్టి వంతెన కొట్టుకుపోయింది. నీరు వెళ్లేందుకు మట్టి వంతెన కింద ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద సిమెంట్​ పైపులు కూడా ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ప్రస్తుతం ప్రజలు పాత వంతెనపై వెళ్లలేక, మట్టి వంతెన కూడా లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రాంతంలో మరో వంతెన నిర్మించాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఇదీ చదవండి: preparations: పంటల కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా ఏం చేద్దాం..!

ABOUT THE AUTHOR

...view details