తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం, డబ్బులు పంచకుండా ఎన్నికల్లో గెలుస్తారా? : మందకృష్ణ - ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేయకుండా గెలుస్తారా అని మందకృష్ణ మాదిగ ప్రశ్న

ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుండా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమా అని మహజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సవాలు విసిరారు. ప్రజలకు ఏం చేయబోతున్నారో చెప్పి ఎన్నికల బరిలో దిగాలని వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా హాలియాలో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు.

msp
మందకృష్ణ మాదిగ

By

Published : Jan 4, 2021, 6:27 PM IST

మద్యం, డబ్బులు పంచకుండా తెరాస, భాజపా, కాంగ్రెస్​లు ఎన్నికల్లో పోటీ చేస్తాయీ అని మహజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ప్రజలకు ఏం చేశారో చెప్పాకే సాగర్​ ఉపఎన్నిక బరిలో నిలవాలని సవాలు విసిరారు. నల్గొండ జిల్లా హాలియాలో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు.

ప్రజలను ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేయమని దేవతల మీద ప్రమాణం చేయగలరా అని మందకృష్ణ ప్రశ్నించారు. ఏం అభివృద్ధి పనులు చేశారో ప్రజలకు చెప్పి పోటీ చేసే పార్టీలు ఉన్నాయా అని వ్యాఖ్యానించారు. సాగర్​ ఉపఎన్నికకు త్వరలోనే మహజన సోషలిస్టు పార్టీ అభ్యర్థిని వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:'ఈడబ్ల్యూఎస్' కోటా అమలు చేయాలని హైకోర్టులో పిల్​

ABOUT THE AUTHOR

...view details