నల్గొండ జిల్లా మునుగోడులో ఎంపీటీసీ బొడ్డు శ్రావణి ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా... జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. దీక్షకు రాష్ట్ర జర్నలిస్ట్‌ల ఫోరం ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్ మద్దతు తెలిపారు. మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠాశాలకు 70 ఏళ్ల చరిత్ర ఉందని రవి కుమార్ తెలిపారు. ఈ పాఠశాలలో చదువుకున్న వాళ్లు ప్రస్తుతం గొప్పగొప్ప స్థానాల్లో ఉన్నారన్నారు. అధికారులు తక్షణమే స్పందించి గదుల నిర్మాణాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
తరగతి గదుల నిర్మాణం కోసం ఎంపీటీసీ నిరాహార దీక్ష - MPTC hunger strike for classrooms
జిల్లా ఉన్నత పాఠశాల భవనంలో తరగతుల నిర్మాణంలో జాప్యం చేస్తున్నారంటూ నల్గొండ జిల్లా మునుగోడులో ఎంపీటీసీ శ్రావణి ఒక్కరోజు నిరాహార దీక్ష చేశారు. రాష్ట్ర జర్నలిస్ట్‌ల ఫోరం ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్ దీక్షకు మద్దతు తెలిపారు.
MPTC hunger strike for classrooms