రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు అంటూ ఉండరని అంటుంటారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అనుముల మండలం చలమారెడ్డి గూడెంలో చలకుర్తి మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రాంమూర్తి యాదవ్ అల్లుళ్లు దీన్నే నిజం చేశారు. ఒకే గ్రామం నుంచి ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. తెరాస పార్టీ నుంచి రావుల రాంబాబు, కాంగ్రెస్ నుంచి రావుల శ్రీనివాస్ ఇద్దరూ పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బరిలో దిగారు. వీరిద్దరూ.. మాజీ ఎమ్మెల్యే రాంమూర్తి యాదవ్ కుమార్తెలను వివాహమాడారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ కూడా వీరికి తోడి అల్లుడు. చలమారెడ్డి గూడెంలో తోడి అల్లుళ్ల పోటీతో ఎంపీటీసీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
చలమారెడ్డి గూడెంలో తోడి అల్లుళ్ల పోటీ - mptc
నాగార్జునసాగర్ నియోజకవర్గం చలమారెడ్డి గూడెంలో ఆసక్తికర పోటీ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రాంమూర్తి అల్లుళ్లు ఒకే గ్రామం నుంచి ఎంపీటీసీ స్థానానికి పోటీ పడుతున్నారు.
తోడి అల్లుళ్ల పోటీ