తెలంగాణ

telangana

ETV Bharat / state

11మంది ఉండాల్సింది.. ఇద్దరితోనే నడిపిస్తున్నారు: ఉత్తమ్‌ - నల్గొండ జిల్లా తాజా వార్తలు

టీఎస్‌పీఎస్సీలో 11మంది ఉండాల్సింది.. ఇద్దరితోనే నడిపిస్తున్నారని ఎంపీ ఉత్తమ్‌ కుమార్​ రెడ్డి అన్నారు. నల్గొండలో రాములు నాయక్‌ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

mp uttam kumar reddy participated in mlc nomination progrom in nalgonda
11 మంది ఉండాల్సింది.. ఇద్దరితోనే నడిపిస్తున్నారు: ఉత్తమ్‌

By

Published : Feb 18, 2021, 3:45 PM IST

నల్గొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్​ తరుఫున రాములు నాయక్‌ నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్‌ కుమార్​ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. పట్టభద్రులు, నిరుద్యోగులను ఓట్లు అడిగే అర్హత కేసీఆర్‌కు లేదని ఉత్తమ్‌ కుమార్​ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో రాములు నాయక్‌ విజయం ఖాయమని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు. 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు.. తెరాస పాలనకు నిదర్శనమన్నారు.

టీఎస్‌పీఎస్సీలో 11మంది ఉండాల్సింది... ఇద్దరితోనే నడిపిస్తున్నారని చెప్పారు. నిరుద్యోగ భృతి అమలయ్యే వరకు.. తెరాసను చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. 7.5 శాతం ఫిట్‌మెంట్‌ అంటే ఉద్యోగులను అవమానించడమేనని స్పష్టం చేశారు. కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌ తెలంగాణకు రూపాయి మేలు కూడా చేయలేదన్నారు. విభజన చట్టంలోని హామీలను పట్టించుకోలేదని ఉత్తమ్‌ మండిపడ్డారు.

11 మంది ఉండాల్సింది.. ఇద్దరితోనే నడిపిస్తున్నారు: ఉత్తమ్‌

ఇదీ చదవండి:బోయిన్‌పల్లి అపహరణ కేసులో 14 మందికి బెయిల్

ABOUT THE AUTHOR

...view details