తెలంగాణ

telangana

ETV Bharat / state

Uttam on Helicopter Crash: 'వీవీఐపీ హెలికాప్టర్‌కు ప్రమాదం జరగడం ఆశ్చర్యంగా ఉంది' - Mp uttam kumar reddy on helicopter accident

Uttam on Helicopter Crash: సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనపై ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పందించారు. వీవీఐపీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్​కు ఇలా జరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థించారు.

Army Helicopter Crash
బిపిన్ రావత్

By

Published : Dec 8, 2021, 5:05 PM IST

Uttam on Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాద ఘటనపై నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. అందరూ కోలుకుని ఇంటికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. క్షేమంగా ఇంటికి రావాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. పర్వత ప్రాంతాల్లో ప్రయాణం ప్రమాదకరమేనన్న ఉత్తమ్‌... పర్వత ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఉంటుందని ఉత్తమ్‌ పేర్కొన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ హెలికాప్టర్‌కు జాగ్రత్తలు తీసుకుంటారని వివరించారు. కోయంబత్తూరు నుంచి కూనూరు దగ్గరి ప్రయాణమేనన్న ఉత్తమ్‌... త్రివిధ దళాల శిక్షణ కేంద్రానికి వెళ్తున్నట్లు తెలిసిందన్నారు.

త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం బాధాకరం. కోయంబత్తూర్ నుంచి కూనురుకు వెళ్తుండగా ఘోరప్రమాదం జరిగింది. బిపిన్ రావత్‌తో పాటు ఆయన సతీమణి, వారి స్టాఫ్ అంతా క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. వారు ట్రావెల్ చేస్తున్న హెలికాప్టర్ మీ17 అనే రష్యన్ హెలికాప్టర్ అది. అంతా కూడా సేఫ్ హెలికాప్టర్ అనే భావిస్తారు. ఒక వీవీఐపీకి కేటాయించిన హెలికాప్టర్‌లో ఈ ప్రమాదం జరగడం ఆశ్చర్యంగా ఉంది. యాక్సిడెంట్‌కు గల కారణం ఏంటనేది ఊహకు అందడం లేదు. ఇందుకు సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రేపు ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. పర్వత ప్రాంతాల్లో ప్రయాణం ఎప్పుడూ ప్రమాదమే.

ABOUT THE AUTHOR

...view details