నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డిని ఓడించాలని చెబుతున్న తెరాస, భాజపా నాయకులపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ రావడంలో జానారెడ్డి పాత్ర ఎంతో ఉందన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత తెరాసని కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పిన కేసీఆర్ మాట తప్పాడని విమర్శించారు.
ఎవరిని కొడతారో చూద్దామా..?: రేవంత్ - revanth reddy latest news
ఓయూకు వెళ్తే.. అక్కడ ఎవరి బట్టలు చినిగేలా కొడతారో చూద్దామా అంటూ ఓ తెరాస ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. తెలంగాణ రావడంలో జానారెడ్డి పాత్ర ఎంతో ఉందన్నారు. ఆయన్ను గెలిపించాలని కోరారు.
జానారెడ్డి విజయం తెలంగాణకు అవసరమన్నారు. తెరాస నాయకులు 15న ప్రచారం అయిపోయిన తర్వాత సాగర్ నుంచి బయలుదేరి ఉస్మానియావిశ్వవిద్యాలయం వెళ్దామన్నారు. అక్కడ రాత్రి వరకు ఉంటే ఎవరి బట్టలు చినిగేలా కొడతారో చూద్దామా అని సవాలు విసిరారు. సాగర్లో తెరాస, భాజపా డ్రామాలు అడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఇవ్వమంటేనే భాజపా రవి కుమార్కు టికెట్ ఇచ్చిందని ఆరోపించారు. భాజపాలో బండి సంజయ్కు కేంద్ర మంత్రికి ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోందని చెప్పారు.
ఇదీ చదవండి:ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్, తెరాస