MP Komatireddy letter to Sonu Sood Foundation: ఆపద ఉందని తెలిస్తే చాలు.. అక్కడ వాలిపోవటమో..? తనకు చేతనైన సాయం చేయటమో..? ఎలా అయితే ఏంటీ.. వారి జీవితాల్లో ఆనందం నింపటమే అతడి కర్తవ్యం.. అనేలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. అలాంటి సోనూసూద్‌కు ఇప్పుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది.
అసలు విషయమేమిటంటే... సినీనటుడు సోనూసూద్ ఫౌండేషన్‌కి ట్విట్టర్ ద్వారా ఎంపీ లేఖ రాశారు. తన పార్లమెంట్ పరిధిలోని జనగామ జిల్లాకు చెందిన చామకూర శ్రీనాథ్ వ్యవసాయ పనులు చేస్తుండగా.. ప్రమాదం జరిగి ఎడమ చెయ్యికి తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదంలో గాయమైన ఎడమ చెయ్యికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. శ్రీనాథ్ తండ్రి నిరుపేద రైతు కావడంతో ఆపరేషన్‌కు డబ్బులు లేక బాధపడుతున్నారు.