'2023 ఎన్నికల్లో.. ఉమ్మడి నల్గొండలో 12 స్థానాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్' MP Komatireddy Telangana Assembly Elections 2023 : తెలంగాణలో మరి కొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కుంపటిని రాజేసింది. ఈ సారి తెలంగాణలో హస్తం పార్టీ పాగా వేయడానికి అన్ని రాజకీయ సమీకరణాలతో సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ భవనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డినివాసంలో ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో పార్టీ అనుసరించాల్సిన విధివిధాలను చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
నల్గొండలో 12కు 12 క్లీన్‌స్వీప్ చేస్తాం:భేటీకి ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో నేతలు కొత్తగా చేరాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. మొత్తం 12 శాసనసభ స్థానాలకు 12 స్థానాలు రిజర్వ్ అయిపోయాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో మొత్తం 12 స్థానాలు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కోదాడ శశిధర్ రెడ్డి పార్టీలో చేరే అంశం ఇప్పటి వరకు చర్చకు రాలేదని కోమటిరెడ్డి తెలిపారు. త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రోడ్ మ్యాప్ కోసమే ముఖ్యనేతలను ఆహ్వానించానని వెల్లడించారు. ఆగస్టు నెల నుంచి ఎన్నికల ప్రచారం ఉద్ధృతం చేస్తామని చెప్పారు. తమ పార్టీ నేతలందరూ కలిసికట్టుగా బస్ యాత్ర చేయాలనేది తన కోరకగా చెప్పుకొచ్చారు. భేటీలో నేతల సలహాలు అనుచరించి ముందుకు వెళ్తామని వెంకట్ రెడ్డి అన్నారు.. ఇక నుంచి ముఖ్య నేతల ఇళ్లల్లో వరుస సమావేశాలు ఉంటాయని పేర్కొన్నారు.
Telangana Congress leaders meeting : కోమటిరెడ్డి నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఉదయం 11గంటలకు భేటీ జరగాల్సి ఉండగా.. కాస్త ఆలస్యం అయింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల ఉద్ధృతిపై వ్యూహరచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్. ఈ భేటీకి పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిసహా ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. ఇతర పార్టీల నుంచి హస్తం గూటికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న వారి గురించి కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: