తెలంగాణ

telangana

ETV Bharat / state

భువనగిరిలో క్రీడలకు మౌలిక వసతులు కల్పించండి: కోమటిరెడ్డి - telangana latest news

భువనగిరి నియోజకవర్గం పరిధిలో క్రీడా సముదాయం, స్టేడియం నిర్మాణం చేపట్టాలని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్​ రిజీజుకు ఎంపీ కోమటిరెడ్డి విజ్ఞప్తి చేస్తారు. భువ‌న‌గిరి గుట్ట 700 అడుగుల ఎత్తులో రాక్ క్లైంబింగ్‌ కోసం అద్భుతంగా పనిచేస్తుందని తన వినతిపత్రంలో ఎంపీ వివరించారు.

mp komati reddy venkat reddy met union sports minister
mp komati reddy venkat reddy met union sports minister

By

Published : Jun 21, 2021, 11:01 PM IST

యాదాద్రి జిల్లా భువనగిరిలో క్రీడా సముదాయం, స్టేడియం నిర్మించాల‌ని కోరుతూ కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించినట్లు ఎంపీ తెలిపారు.

కేంద్ర క్రీడల శాఖ మంత్రికి ఎంపీ కోమటిరెడ్డి వినతిపత్రం

ఇప్పటి వ‌ర‌కు కేంద్రం.. తన క్రీడాభివృద్ధి నిధుల‌తో తన నియోజకవ‌ర్గానికి ఏమీ చేయలేదన్నారు. భువ‌న‌గిరి గుట్ట 700 అడుగుల ఎత్తులో రాక్ క్లైంబింగ్‌ కోసం అద్భుతంగా పనిచేస్తుందని తన వినతిపత్రంలో ఎంపీ వివరించారు. హైద‌రాబాద్‌ నగరానికి ద‌గ్గరగా ఉండ‌డం సహా.. స్థానికంగా ఎంతో మంది శిక్షణ తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎంపీ పేర్కొన్నారు. ఎవ‌రెస్ట్ ఎక్కిన పూర్ణ మలావ‌త్ ఇక్కడున్న క్లైంబింగ్ స్కూలులో శిక్షణ తీసుకొని దేశానికి గొప్ప పేరు తెచ్చారని కేంద్ర మంత్రి కిరణ్​ రిజీజు వివ‌రించారు.

ఇవీచూడండి:Cm Yadadri Visit: సీఎం యాదాద్రి పర్యటన... బాలాలయంలో దర్శనం

ABOUT THE AUTHOR

...view details