తెలంగాణ

telangana

ETV Bharat / state

MP Komati Reddy on Power Cuts in Telangana : 'తెలంగాణలో కరెంట్ కోతల్లేవా.. నాతో రండి చూపిస్తా'

MP Komati Reddy on Power Cuts in Telangana : రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు దారుణంగా ఉన్నాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. '24 గంటలు కరెంట్ అంటూ కేసీఆర్ తన పర్యటనల్లో కూతలు కూస్తున్నారు.. అసలు కరెంట్ కోతలే లేవంటున్న బీఆర్ఎస్ నేతలు ఓ సారి నాతో రండి.. చూపిస్తా' అంటూ కోమటిరెడ్డి సవాల్ విసిరారు. నల్గొండ మండలం అప్పాజీపేటలో వారం నుంచి కనీసం 6 గంటలు కూడా కరెంట్ రావడం లేదని .. విద్యుత్‌ కోతలపై తనకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.

MP Komati Reddy
MP Komati Reddy Fires on CM KCR

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2023, 2:34 PM IST

MP Komati Reddy on Power Cuts in Telangana తెలంగాణలో కరెంట్ కోతల్లేవా.. నాతో రండి చూపిస్తా

MP Komati Reddy on Power Cuts in Telangana :రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్.. ప్రచారాల్లో, సభల్లో దేశంలో 24 గంటలు రైతులకుఉచిత కరెంటుఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణయే అంటూ ప్రజలకు చెబుతున్నారు. కానీ దాన్ని హస్తం పార్టీ నేతలు మాత్రం తిప్పి కొడుతున్నారు. ఆ మధ్యకాలంలో ఉచిత కరెంటు విషయంలో గులాబీ నేతలకు, హస్తం నాయకులకు చిన్నపాటి యుద్ధమే జరిగింది. విద్యుత్​ విషయంలో రాజీనామా వరకు వెళ్లింది ఈ పంచాయతీ.

MP Komati Reddy Slams KCR Over 24 Hours Power : తెలంగాణలో ఏ ఒక్క గ్రామంలో కూడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని కాంగ్రెస్​ నాయకులు మొదటి నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దాన్ని అధికార పార్టీ నేతలు తిప్పికొడుతూనే ఉన్నారు. కాగా బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా​ విడుదల చేసినప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ప్రభుత్వ వైఫల్యాలు ఎప్పుడు చేతికి చిక్కుతాయా అన్నట్టుగా ప్రతిపక్ష నాయకులు ఎదురుచూస్తున్నారు. ఇది వరకే కరెంట్ విషయంలో రచ్చకెక్కిన నేతలు మళ్లీ దీనిపై స్పందిస్తున్నారు. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి(MP Komatireddy Venkatreddy) కరెంటు విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Revanth Reddy Challenge To KTR : '24 గంటల విద్యుత్​పై చర్చకు సిద్ధం.. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి'

MP Komati Reddy On Telangana Power Supply :రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు దారుణంగా ఉన్నాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆక్షేపించారు. విద్యుత్‌ కోతలపై ఇప్పటికే తనకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు వస్తున్నాయని.. నల్గొండ మండలం అప్పాజీపేటలో వారం నుంచి కనీసం 6 గంటలు కూడా కరెంట్ ఉండటం లేదని చెప్పారు.

విద్యుత్ సరఫరా సరిపడా లేక పొలాలు ఎండి పోతున్నాయని.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. సీఎం తన పర్యటనలో 2,3 గంటలు కరెంట్ ఇచ్చే ప్రభుత్వం కావాలా లేక 24 గంటలు కరెంట్ కావాలా అని ప్రజలను అడుగుతున్నారని దుయ్యబట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... రాష్ట్రంలో ఎక్కడా 12, 13 గంటల కంటే ఎక్కవ కరెంట్ ఇవ్వడం లేదని అన్నారు. 24 గంటలు ఇచ్చేంత కరెంట్ లేకపోతే చెప్పాలని.. ఇతర రాష్ట్రాల నుంచి కొని ప్రజలకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాటలు నమ్మి రైతులు నాట్లు వేసుకున్నారని.. సర్కార్ ఇచ్చే రైతుబంధు డబ్బులు రైతు తెచ్చిన పెట్టుబడికి వడ్డీ కట్టేందుకు కూడా సరిపోవడంలేదని అన్నారు. మూడు నెలల తర్వాత వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎంపీ కోమటిరెడ్డి జోస్యం చెప్పారు.

PRATHIDWANI: ఉచిత కరెంట్.. వినియోగదారులపై ఎలాంటి ప్రభావం?

పైసలిస్తేనే 'ఫ్రీ' కరెంట్‌.. ఇవ్వకపోతే సరఫరా బంద్‌

ABOUT THE AUTHOR

...view details