కరోనా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తుందని రాజ్యసభ ఎంపీ(MP) బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సీఎస్ఆర్(CSR) నిధుల నుంచి మంజూరైన మెడికల్ కిట్(Medical kit), వీల్ చైర్, ఐసీయూ బెడ్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్(oxygen concentrator)ని స్థానిక ఎమ్మెల్యే(MLA) నోముల భగత్‌తో కలిసి అందజేశారు.
Medical kit: ఆరోగ్య కేంద్రానికి కిట్ అందజేసిన ఎంపీ
నల్గొండ జిల్లా నిడమనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సీఎస్ఆర్ నిధుల నుంచి మంజూరైన మెడికల్ కిట్(Medical kit), వీల్ చైర్, ఐసీయూ బెడ్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్(oxygen concentrator) ని... రాజ్యసభ ఎంపీ(MP) బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే(MLA) నోముల భగత్‌తో కలిసి అందించారు.
అన్ని గ్రామాల్లో ఆరోగ్య సర్వే జరుగుతోందని, కరోనా లక్షణాలు ఉంటే అక్కడికక్కడే మందుల కిట్లు అందజేస్తున్నారని ఎంపీ అన్నారు. కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యం లభిస్తుందని ఆయన తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యం అందిస్తున్న ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బంది పనితీరును ఈ సందర్భంగా ప్రశంసించారు.
ఆపత్కాలంలో ప్రజల అవస్థలు తీర్చుటకు నిడమనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మెడికల్ కిట్(Medical kit) మంజూరు చేయించడం పట్ల… ఎమ్మెల్యే(MLA) నోముల భగత్ అభినందనలు తెలియజేశారు.
ఇదీ చూడండి:Oxgen tanks: హైదరాబాద్‌కు చేరుకున్న ఆక్సిజన్ ట్యాంకర్లు