తెలంగాణ

telangana

ETV Bharat / state

తల్లి మృతి తట్టుకోలేక కుమారుడు మృతి - Nakkalapally crime news

అమ్మంటే ఆ బిడ్డకు ఎక్కడలేని ప్రేమ. చిన్నప్పట్నుంచి అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసిన తల్లి అనారోగ్యం బారినపడటంతో కుంగిపోయాడు. రెండేళ్లుగా ఆమె సేవలో తరించాడు. ఉన్నట్టుండి తల్లి తనను వదిలి వెళ్లిపోయిందని తెలుసుకుని గుండెలవిసేలా రోదించాడు. అంతటి బాధను భరించలేకపోయిందో? ఏమో! ఆ గుండె ఆగిపోయింది. ఆమెతోటే ఆ కట్టె కాలిపోయింది.

mother died effect with son died, nakkalapalli crime news today
తల్లి మృతి తట్టుకోలేక కుమారుడు మృతి

By

Published : Apr 17, 2021, 6:42 AM IST

తల్లి మృతి తట్టుకోలేక ఓ కుమారుడు మృతి చెందాడు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లికి చెందిన యానాల సత్తిరెడ్డి, సత్యమ్మ(58) దంపతులది వ్యవసాయ కుటుంబం. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెలిద్దరూ వివాహాలై అత్తవారింటికి వెళ్లారు. కుమారుడు నాగిరెడ్డి(39) వ్యవసాయ పనులు చూసుకుంటూ కుటుంబానికి అండగా నిలిచాడు. సత్యమ్మ రెండేళ్ల క్రితం కేన్సర్‌ బారినపడింది. అప్పట్నుంచి కుమారుడు తల్లిని కంటికిరెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు.

ఆ ఆసుపత్రిలో మంచి చికిత్స దొరుకుతుందంటే అక్కడికంతా తీసుకెళ్లేవాడు. ఆమె వైద్యానికి సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చు చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీర్ఘకాలంగా వ్యాధితో పోరాడుతున్న ఆమె శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న నాగిరెడ్డి హుటాహుటిన పొలం నుంచి ఇంటికొచ్చాడు. తల్లి మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తూ కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు. గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తల్లీ కొడుకులు గంట వ్యవధిలో చనిపోవడాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

ఇదీ చూడండి :మహిళతో అసభ్య ప్రవర్తన.. 21మంది అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details