తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడ్రోజులకే చిన్నారి మృతి..బంధువుల ఆందోళన - dead

నవ మాసాలు మోసింది. పురిటినొప్పులు భరించింది. పండంటి పాపకు జన్మనిచ్చింది. కానీ..మూడు రోజులకే శిశువు మృతి చెందింది. పాప మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగిన ఘటన నల్గొండలో జరిగింది.

బంధువుల ఆందోళన

By

Published : Jul 24, 2019, 12:38 PM IST

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లికి చెందిన రెడ్డిపల్లి రేణుక ప్రసవం కోసం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. గత శనివారం రాత్రి ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రెండు రోజులు బాగానే ఉన్న శిశువు మంగళవారం మృతి చెందింది. ఏం జరిగిందని డాక్టర్లను ప్రశ్నించగా సమాధానం చెప్పడం లేదని రేణుక భర్త శివకుమార్​ చెప్పారు. పాప మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మూడ్రోజులకే చిన్నారి మృతి..బంధువుల ఆందోళన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details