తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్గొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

నల్గొండలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్జీ కళాశాల మైదానంలో పర్యటించి తనని గెలిపించాలని కోరారు. జిల్లాలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కానున్నారు.

mlc-elections-campaign-in-nalgonda-district-by-bjp
నల్గొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

By

Published : Jan 3, 2021, 12:12 PM IST

నల్గొండలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఈ రోజు ఉదయం... జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో మార్నింగ్ వాకర్స్‌ను కలిసి తమకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. అనంతరం జిల్లాలో పర్యటించి పట్టభద్రులు, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కానున్నారు.

ఈ ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా రాష్ట్ర భాజపా కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, బండారు ప్రసాద్, మురిచెట్టి నాగేశ్వర్ రావు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'సినిమా ఛాన్స్​ల కోసం ఎవర్నీ వాడుకోలేదు'

ABOUT THE AUTHOR

...view details