తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస బహిరంగసభను విజయవంతం చేయాలి: చిన్నపరెడ్డి

ఈ నెల 10న నల్గొండ జిల్లా హాలియాలో జరగనున్న తెరాస బహిరంగసభ ఏర్పాట్లను ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పరిశీలించారు. సభను విజయవంతం చేయాలని కోరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 లక్షల మంది తరలి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

MLC Chinnapareddy reviewed the arrangements for the Trs public meeting
తెరాస బహిరంగసభను విజయవంతం చేయాలి: చిన్నపరెడ్డి

By

Published : Feb 8, 2021, 6:26 PM IST

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో ఈ నెల 10న జరగనున్న తెరాస బహిరంగసభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి కోరారు. అనుముల మండలం 14వ మైలు(అలీ నగర్) సమీపంలో ఈ సమావేశం జరగనుంది. సభా స్థలంలో జరుగుతున్న ఏర్పాట్లను చిన్నపరెడ్డి పరిశీలించారు. పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తెరాస బహిరంగసభకు ముస్తాబవుతోన్న వేదిక

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​కే దక్కుతుందన్నారు. నెల్లికల్లులో లిఫ్ట్​తో పాటు మరో తొమ్మిది లిఫ్ట్​లకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. 2 లక్షల మంది సభకు తరలి వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

ఇదీ చూడండి: రెండో రోజుకు రేవంత్ రెడ్డి పాదయాత్ర.. ప్రజా సమస్యలపై ఆరా

ABOUT THE AUTHOR

...view details