తెలంగాణ

telangana

గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి ఏం చేశారో చెప్పాలి: ఉత్తమ్

By

Published : Feb 21, 2021, 10:40 PM IST

నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్​రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ పాల్గొన్నారు.

mlc-candidate-ramulu-nayak-introductory-programme-at-tripuraram-in-nalgonda-district
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి ఏం చేశారో చెప్పాలి: ఉత్తమ్

నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలు, ముఖ్య నాయకులతో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్​ అభ్యర్థి రాములు నాయక్ పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్​రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ పాల్గొన్నారు.

ఏం చేశారో చెప్పాలి:

భాజపా, తెరాస పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఉత్తమ్ కుమార్​రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అవినీతి పరుడని.. విద్యాసంస్థల్ని కాపాడుకోవడం కోసమే సీఎం కేసీఆర్ పక్కన చేరాడని ఉత్తమ్​ ఆరోపించారు. ఆయన గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి ఏం చేశారో చెప్పాలని డిమాండ్​ చేశారు.

మళ్లీ మోసం:

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మళ్లీ మోసం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కుటుంబంలో మాత్రమే అందరికీ ఉద్యోగాలు వచ్చాయని.. నిరుద్యోగులు అలాగే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్​కే సీఎం కేసీఆర్ పరిమితం అయ్యారని విమర్శించారు. హాలియా సభలో గిరిజన మహిళల పట్ల సీఎం అసభ్యంగా మాట్లాడారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయక్​ను గెలిపించాలని కోరారు.

ఇదీ చూడండి: ముస్లిం మహిళల తొలి కథా సంకలనం 'మొహర్' ఆవిష్కరణ

ABOUT THE AUTHOR

...view details