తెలంగాణ

telangana

ETV Bharat / state

జానారెడ్డి గెలుపు చారిత్రక అవసరం: సీతక్క - Congress mla seethakka campaigning

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా పెద్దవూర మండలంలో జానారెడ్డితో ఎమ్మెల్యే సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జానారెడ్డిని గెలిపించాలని ఆమె కోరారు.

Mla seethakka
సీతక్క

By

Published : Apr 8, 2021, 8:23 PM IST

జానారెడ్డి అంత రాజకీయ అనుభవం లేని వాళ్లు కూడా ఆయన గురించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో జానారెడ్డి గెలుపు చారిత్రక అవసరమని ఆమె అన్నారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో జానారెడ్డితో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

జానారెడ్డి స్థానికుడు. 40 ఏళ్లుగా మీ మధ్యే ఉంటున్నారు. సాగర్​లో జరిగిన అభివృద్ధి అంతా ఆయన చేసిందే. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టించిందే కాంగ్రెస్ పార్టీ. అది గుర్తు ఉంచుకుని ఎవరైనా మాట్లాడాలి. మా ప్రభుత్వంలో 4 కిలోల బియ్యంతో పాటు 9 రకాల సరుకులు ప్రజలకు ఇచ్చాం. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిన వారంతా నేడు పిట్టల్లా రాలుతున్నారు. ప్రతిపక్ష గొంతు వినిపించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. జానారెడ్డి అంత అనువభం లేని వాళ్లు నేడు కూడా ఆయన గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details