నాగార్జున సాగర్‌కు 40 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహించిన జానారెడ్డి, ఏడేళ్లుగా అధికారంలో ఉన్న తెరాస ఎమ్మెల్యేలు ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం ఆల్వాల, శ్రీరాంపల్లి, రంగుండ్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాగర్ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి రవి కుమార్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.
వారు నియోజకవర్గ అభివృద్ధిని మరిచారు: ఎమ్మెల్యే రఘునందన్ రావు - ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘునందన్
ఏడేళ్ల తెరాస పాలనలో సీఎం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన భాజపా అభ్యర్థిని గెలిపించాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘునందన్
జానారెడ్డి, కేసీఆర్‌లకు ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే సమయం సరిపోదని ఎమ్మెల్యే రఘనందన్ రావు అన్నారు. తెరాస ప్రభుత్వంలో ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సాగర్ ఉప ఎన్నికలో దుబ్బాక ఫలితమే పునరావృతం కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:వర్సిటీల నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు