తెలంగాణ

telangana

'వరద బాధితులకు త్వరలోనే ఇళ్లు నిర్మించి ఇస్తాం'

By

Published : Oct 21, 2020, 8:49 PM IST

నల్గొండ జిల్లా నిడమానూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య పర్యటించారు. వరదలకు దెబ్బతిన్న ఇళ్లను, రోడ్లను పరిశీలించారు. బాధితులకు కలిసి పరామర్శించి... తక్షణ సాయం అందించారు.

'వరద బాధితులకు త్వరలోనే ఇళ్లు నిర్మించి ఇస్తాం'
'వరద బాధితులకు త్వరలోనే ఇళ్లు నిర్మించి ఇస్తాం'


నల్గొండ జిల్లా నిడమానూరు మండల కేంద్రంలో ఇటీవల కురిసిన వర్షానికి దెబ్బతిన్న ఇళ్లను ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య పరిశీలించారు. బాధితులను పరామర్శించి తక్షణ సాయం కింద ఇళ్లు కూలిపోయిన బాధిత కుటుంబాలకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందించారు.

ప్రభుత్వం నుంచి త్వరలోనే ఇళ్లను నిర్మించి ఇస్తామని భరోసా ఇచ్చారు. రామాలయం కాలనీ వీధుల్లో వరదకు తెగిపోయిన మిర్యాలగూడ-హాలియా రోడ్ కల్వర్టును, నిడమానూరు- బంకాపురం దెబ్బతిన్న రోడ్ కల్వర్టును పరిశీలించారు.

ఇదీ చూడండి: భారీ వర్షాలతో రోడ్లు చిన్నాభిన్నం...ప్రయాణం నరకప్రాయం

ABOUT THE AUTHOR

...view details