తెలంగాణ

telangana

ETV Bharat / state

'లాక్​డౌన్​ నిబంధనలు ఎవరూ ఉల్లంఘించరాదు' - mla nomula narsimhaiah

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​ వద్ద చెక్​పోస్ట్​ను ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనిఖీ చేశారు. రాష్ట్ర సరిహద్దు కావడం వల్ల బయటవారెవరిని లోనికి అనుమతించకూడదని పోలీసులను ఆదేశించారు.

mla nomula narsimhaiah distributed groceries
నాగార్జునసాగర్​ వద్ద ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య

By

Published : Apr 26, 2020, 4:51 PM IST

నల్గొండ జిల్లా హాలియా పురపాలికలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య నిత్యావసర సరుకులు అందజేశారు.

అనంతరం నాగార్జునసాగర్​లోని పైలాన్​కాలనీలో రసాయన ద్రావణాన్ని ఎమ్మెల్యే పిచికారీ చేయించారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని సూచించారు. లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించి ప్రజలు బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు.

నాగార్జునసాగర్​ వంతెన వద్ద ఉన్న చెక్​పోస్టును తనిఖీ చేసి, బయట నుంచి ఎవరూ రాకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details