తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయండి: నోముల భగత్ - తెలంగాణ వార్తలు

నాగార్జునసాగర్​లో వరి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని అధికారులను ఎమ్మెల్యే నోముల భగత్ ఆదేశించారు. జిల్లాలోని అనుముల మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు.

MLA Nomula Bhagat visiting a rice procurement center in Nalgonda
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే నోముల భగత్

By

Published : May 29, 2021, 8:27 PM IST

వర్షాకాలం దగ్గర పడుతున్న తరుణంలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని అధికారులను నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల భగత్ (Nomula Bhagath) ఆదేశించారు. మిల్లర్లు కూడా ధాన్యం దిగుమతి విషయంలో సహకరించాలని సూచించారు. నల్గొండ జిల్లా అనుముల మండలం యాచారం గ్రామంలో.. ప్యాక్స్ హాలియా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు.

యాచారం గ్రామ పరిధిలో 5 గ్రామాలకు చెందిన రైతులు.. ధాన్యం కొనుగోలు కోసం వారు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేకి వివరించారు. ఇబ్బందులను తెలుసుకున్న ఆయన.. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details