తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకునే సమయంలో ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని అందరికి ఆశలు కల్పించారని శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. స్వరాష్ట్రం సాధించుకుని 7 ఏళ్లు గడిచిన ఎంతమందికి ఉద్యోగాలిచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చినా... తమ బతుకులు మారలేదనే ధోరణిలో ప్రజలున్నారని గొంతెత్తారు.
ఏడేళ్లలో ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు: రాజగోపాల్‌రెడ్డి - komatireddy rajagopal reddy talk about Unemployment
నిరుద్యోగ సమస్యపై అసెంబ్లీలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గొంతెత్తారు. స్వరాష్ట్రం సాధించుకుని 7ఏళ్లు గడిచాయని... ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు.
KOMATIREDDY
ఈ సందర్భంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి కల్పించుకుని రాష్ట్ర సమస్యలపై మాట్లాడండి.. కానీ రాజకీయ ప్రసంగాలు వద్దని సూచించారు. ఆవేశంతో మాట్లాడొద్దు... ఆలోచనతో మాట్లాడాలని రాజగోపాల్‌రెడ్డికి సలహా ఇచ్చారు. తన ఆవేశాన్ని తప్పుగా తీసుకోవద్దని... అందులో ఆవేదన ఉందని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:తెలంగాణలో కొత్తగా 18 డయాగ్నస్టిక్ సెంటర్లు: మంత్రి ఈటల
Last Updated : Mar 25, 2021, 7:20 PM IST