నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో తెరాస అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపించాలంటూ తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిషోర్ ప్రచారం నిర్వహించారు. సుల్తాన్పూరం, వెంకటాపురం, ఉట్టపల్లి, శాఖజీపురం గ్రామాల్లో సైకిల్‌పై ఇంటింటికి తిరుగుతూ ఓట్ల కోసం అభ్యర్థించారు.
కారు గెలుపు కోసం సైకిల్‌పై ప్రచారం - గాదరి కిషోర్ వార్తలు
నోముల భగత్‌ను గెలిపించాలంటూ సాగర్‌లో ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రచారం చేశారు. తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ... ఓట్లు వేయాలని అభ్యర్థించారు.
![కారు గెలుపు కోసం సైకిల్‌పై ప్రచారం gadari kishore campaign at sagar on by election](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11327758-thumbnail-3x2-sagar.jpg)
తెరాస అభ్యర్థిని గెలిపించాలంటూ... సైకిల్‌పై ప్రచారం
తెరాస అభ్యర్థిని గెలిపించాలంటూ... సైకిల్‌పై ప్రచారం
తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. దేశంలో ఎక్కడా లేనన్ని పథకాలు రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. సాగర్ నియోజకవర్గం అభివృద్ధి సాధించాలంటే తెరాస అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి:జానారెడ్డికి ఓటమి భయం పట్టుకుంది: తలసాని