ఆశావర్కర్లకు దాతల చేయూత - LOCK DOWN EFFECTS
లాక్డౌన్ వేళ విధులు నిర్వర్తిస్తూ నిత్యం కృషి చేస్తున్న ఆశావర్కర్లను దాతలు ఆదుకుంటున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టీఎన్బీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాస్కరరావు పాల్గొన్నారు.

ఆశావర్కర్లకు దాతల చేయూత
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టీఎన్బీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశావర్కర్లకు ఎమ్మెల్యే భాస్కరరావు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా నివారణలో ఆశావర్కర్లు ఇంటింటి సర్వే చేస్తూ నిత్యం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఆశావర్కర్లకు నిత్యావసరాలు పంపిణీ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు.