నల్గొండ జిల్లా కేంద్రంలోని డీవీకే రోడ్డులోని ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాలలో చదివే విద్యార్థులకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కొవిడ్ కట్టడి కోసం చేపట్టిన నిబంధనలకు అనుగుణంగా చిన్నారులకు పుస్తకాలు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో విద్యార్థులకు టీవీ ఛానెల్ ద్వారా పాఠాలను బోధించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ - mla bhupalreddy distributed text books to students
నల్గొండ జిల్లా కేంద్రంలోని డీవీకే రోడ్డులోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేశారు. త్వరలో టీవీ ఛానెల్ ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధిస్తామని ఎమ్మెల్యే అన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల పాఠశాలలు తెరవడం కష్టమని.. దాని కారణంగా విద్యా సంవత్సరం ఆగిపోకూడదని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ఈ మేరకు విద్యార్థులు నష్టపోకుండా ఇంటివద్దనే చదువుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చూడండి :సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలి: సీఎం కేసీఆర్