తెలంగాణ

telangana

ETV Bharat / state

Mega job mela: మెగా జాబ్​ మేళాకు విశేష స్పందన.. - mega job mela in nalgonda

నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నల్గొండలో శనివారం మెగా జాబ్​ మేళా నిర్వహించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దాదాపుగా 60కి పైగా ప్రైవేట్​ కంపెనీలు పాల్గొన్న మేళాకు నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు.

mega job mela in nalgonda
నల్గొండలో మెగా జాబ్​ మేళా

By

Published : Jul 18, 2021, 12:27 PM IST

Updated : Jul 18, 2021, 1:30 PM IST

నల్గొండ జిల్లా కేంద్రంలో శనివారం.. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్​ మేళాకు విశేష స్పందన లభించింది. 60కిపైగా ప్రైవేటు కంపెనీలు పాల్గొన్న ఈ మేళాలో.. పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 వేల మంది నిరుద్యోగ యువతీయువకులు తరలివచ్చారు. ముఖ్య అతిధిగా రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

1000 నుంచి 1500 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ జాబ్​ మేళా చేపట్టామని.. ఎమ్మల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. జిల్లాలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే రాష్ట్రంలో 50వేల ఉద్యోగాలకు సీఎం కేసీఆర్​.. నోటిఫికేషన్​ వేయనున్నారని స్పష్టం చేశారు.

జాబ్​ మేళాలో పాల్గొన్న నిరుద్యోగ యువత

నిరుద్యోగులకు అండగా మెగా జాబ్​ మేళా నిర్వహించడం.. అభినందనీయం. ఉద్యోగ కల్పన విషయంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ను స్ఫూర్తిగా తీసుకొని.. ఎమ్మెల్యే ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల ఆనందంగా ఉంది. -బడుగు లింగయ్య యాదవ్​, రాజ్యసభ సభ్యుడు

60కి పైగా కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి. నిరుద్యోగుల సమస్యలను చూసి నా వంతు కృషి చేస్తున్నాను. త్వరలోనే సీఎం కేసీఆర్​.. 50వేల పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్​ ఇవ్వనున్నారు. -కంచర్ల భూపాల్​ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే

జాబ్ మేళాలో అమెజాన్, ఎస్బీఐ, ముత్తూట్ ఫైనాన్స్, ఇన్నోవేషన్ యార్డ్, రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్.. ఇలా 62 ప్రైవేట్ కంపెనీలు పాల్గొన్నాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇదీ చదవండి:successful farmer: 'నాది సేంద్రియ పంట.. నేను చెప్పిందే ధర'

Last Updated : Jul 18, 2021, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details