తెలంగాణ

telangana

ETV Bharat / state

650 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసరాల పంపిణీ - MLA Bhaskara Rao provided the essentials to auto driver's

జీవనోపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎన్​బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసరాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే భాస్కరరావు చేతుల మీదుగా వీటిని అందజేశారు.

MLA Bhaskara Rao provided the essentials to auto driver's under the auspices of the NBR Foundation in nalgonda district
MLA Bhaskara Rao provided the essentials to auto driver's under the auspices of the NBR Foundation in nalgonda district

By

Published : Jun 3, 2021, 1:01 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లాక్ డౌన్​లో జీవనోపాధి కోల్పోయిన 650 మంది ఆటోడ్రైవర్లకు… ఎన్​బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే భాస్కరరావు అందజేశారు. కరోనాను నిర్ములించడానికి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

ప్రజలు, కార్మికులు, ఆటో డ్రైవర్లు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు. మాస్కులు, శానిటైజర్​లు వాడుతూ… తగు జాగ్రత్తలతో కరోనాను జయించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎన్​బీఆర్ ఫౌండేషన్​ను ఆయన అభినందించారు.

ఇదీ చూడండి: 'కరోనా దోపిడీ' బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పిస్తారా?

ABOUT THE AUTHOR

...view details