నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కముంతలపాడు వద్ద ఓ ఆటోను డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. ఘటనలో ఒకరు మరణించగా.. 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అటుగా వెళ్తున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు క్షతగాత్రులను పరామర్శించారు. అధికారులకు సమాచారమిచ్చి బాధితులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించడంలో ఆయన చొరవ తీసుకున్నారు.
ఆటో-డీసీఎం ఢీ.. ఒకరు మృతి, 16 మందికి గాయాలు
నల్గొండ జిల్లా బొక్కముంతలపాడు వద్ద ఆటోను డీసీఎం వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మరణించగా 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మెల్యే భాస్కరరావు పరామర్శించి.. వారందరినీ మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఆటోను ఢీకొన్న డీసీఎం వ్యాన్... ఒకరు మృతి
నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంపసాగర్కు చెందిన వీరు నిడమనూరు మండలం ఇబ్రహీంపట్నంలో జరిగిన ఒక శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.