ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World environment day)సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే భాస్కరరావు మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు.
World environment day: 'పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది' - పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World environment day) సందర్భంగా ఎమ్మెల్యే భాస్కరరావు మొక్కలు నాటారు. గ్లోబలైజేషన్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని… అభివృద్ధి అవసరమే కానీ అది విధ్వంసకరంగా ఉండకూడదని ఎమ్మెల్యే అభిప్రాయం వ్యక్తం చేశారు.
World environment day: 'పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది'
అడవులను నరికి వేయడం వల్ల వాతావరణంలో పెను మార్పులు సంభవించాయన్నారు. దీనివల్ల ఎండ తీవ్రత, నీటి ఎద్దడి కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. వీటన్నింటిని అధిగమించాలంటే చెట్లను నాటి అడవులను రక్షించి ప్రగతి పథంలో నడవాలని కోరారు. ప్రకృతి జీవన చక్రం సక్రమంగా ఉండాలంటే మొక్కలు, అడవులను పరిరక్షించాలని సూచించారు.
ఇదీ చూడండి:Weather Report: రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు..!