నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో ఎంసెట్‌లో ఆరో ర్యాంకు సాధించిన నితిన్ సాయిని స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు అభినందించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో శాలువా కప్పి, పూలమాలతో సన్మానించారు. రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు సాధించి మిర్యాలగూడ నియోజకవర్గానికి పేరు తీసుకొచ్చారని కొనియాడారు.
ఎంసెట్ ర్యాంకర్‌ను అభినందించిన ఎమ్మెల్యే భాస్కరరావు - ఎంసెట్ ర్యాాంకర్ని అభినందించిన ఎమ్మెల్యే
ఎంసెట్‌లో రాష్ట్ర స్థాయిలో ఆరో ర్యాంకు సాధించిన నితిన్ సాయిని స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు అభినందించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన నితిన్ సాయికి తన క్యాంపు కార్యాలయంలో శాలువా కప్పి ఎమ్మెల్యే సన్మానించారు. కృషి, పట్టుదలతో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.
ఎంసెట్ ర్యాంకర్‌ను అభినందించిన ఎమ్మెల్యే భాస్కరరావు
కృషి, పట్టుదలతో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే ఆశీర్వదించారు. మంగళవారం విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో నితిన్ సాయికి 89.6648 కంబైన్డ్ స్కోర్ నమోదు కాగా,140.3515 మార్కులు సాధించారు. ఐఐటీ ఓపెన్ కేటగిరీలో నితిన్ సాయి 423 ర్యాంకు, ఓబీసీ కేటగిరిలో 48వ ర్యాంకును కైవసం చేసుకున్నారు.