నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారులకు స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు శనివారం చెక్కులు పంపిణీ చేశారు. మిర్యాలగూడ పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పట్టణానికి చెందిన 204 మంది లబ్దిదారులకి రూ. 2,04,23,664 విలువ గల చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అందజేశారు.
Mla Bhaskar rao: రేపటి నుంచి మీ ఇంటికే చెక్కులు - telangana news updates
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే భాస్కర్ రావు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. రేపటి నుంచి చెక్కులను లబ్ధిదారుల ఇళ్ల వద్దే.. పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Mla Bhaskar rao
రేపటి నుంచి చెక్కులను లబ్ధిదారుల ఇళ్ల వద్దే.. పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్థానిక కౌన్సిలర్లు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో మన నియోజకవర్గానికి నిధులను మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి :ఆనందయ్య మందు.. కోటయ్య మృతి