తెలంగాణ

telangana

ETV Bharat / state

రేవంత్​కు తెరాస గురించి మాట్లాడే అర్హత లేదు: బాల్క సుమన్ - తెలంగాణ వార్తలు

తెరాస పార్టీ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రాణాలకు తెగించి రాష్ట్రం తీసుకొచ్చారని అన్నారు.

balka suman press meet, balka suman fires on revanth reddy
బాల్క సుమన్ మీడియా సమావేశం, ఎంపీ రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఆగ్రహం

By

Published : Apr 10, 2021, 2:29 PM IST

నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రంగా స్పందించారు. ఆంధ్రపాలకుల బానిసలుగా పనిచేసిన వారికి తెరాస పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రాణాలకు తెగించి ఉద్యమం చేసి రాష్ట్రం తీసుకొచ్చారని గుర్తు చేశారు.

రూ.కోట్లు ఎలా వచ్చాయి?

ఉద్యమం సమయంలో రేవంత్ ఎక్కడకు పోయారని ప్రశ్నించారు. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి రూ.కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. 2018లో కొడంగల్​లో ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు ఓడిపోలేదని అన్నారు.

ఆనాడు వచ్చారా?

నల్గొండ ప్రజలు ఫ్లోరైడ్​తో బాధపడుతున్ననాడు ఏనాడైనా వచ్చారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ దిల్లీ, గల్లీలో లేదని విమర్శించారు. నాగార్జున సాగర్ అభివృద్ధి చెందాలంటే తెరాస అధికారంలోకి రావాలని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:'కేసీఆర్​ సర్కారు అంటేనే ఒకే ఇంటి పాలన...'

ABOUT THE AUTHOR

...view details