నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ డిపోలో రెండు నూతన కార్గో పార్సిల్ సర్వీస్ బస్సులను ఎమ్మెల్యే భాస్కరరావు ప్రారంభించారు. వాణిజ్య కేంద్రంగా ఉన్న మిర్యాలగూడలో ఈ సేవలను వ్యాపారస్తులు, పట్టణ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో భద్రతతో కూడిన సర్వీస్ అందుతుందని తెలిపారు. ప్రజలు అలవాటు పడే వరకు జీఎస్టీ పన్నును ప్రత్యేకంగా విధించవద్దని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరారు.
కరోనా నేపథ్యంలో బస్సులను అధిక సంఖ్యలో నడపడం లేదని, ప్రయాణికులు లేక ఆదాయం పడిపోయిందని డిపో మేనేజర్ తెలిపారు. కార్మికుల జీతభత్యాలకు, ఆర్టీసీని బతికించుకోవాలనే ఉద్దేశంతో కార్గో పార్సిల్ సర్వీస్‌ను ప్రారంభించామన్నారు. అధిక ప్రచారం చేయడం వల్ల లాభాలు వస్తున్నాయన్నారు. జూలై నెలలో 6లక్షల 90వేల రూపాయలు కార్గో సర్వీస్ వల్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్గో బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే భాస్కరరావు - cargo service
మిర్యాలగూడలో ఆర్టీసీ కార్గో సేవలను వ్యాపారస్తులు, ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. మిర్యాలగూడలో ఆర్టీసీ డిపోలో రెండు నూతన కార్గో పార్సిల్ సర్వీస్ బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఆర్టీసీ కార్గో బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే భాస్కరరావు
ఇవీ చూడండి: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి తలసాని