నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అక్రమ బియ్యం దందా కొనసాగుతోంది. పట్టణంలోని గాంధీ నగర్ బాలికల హైస్కూల్ వద్ద పీడీఎస్ బియ్యాన్ని నూకలుగా మార్చి డీసీఎంలో తరలిస్తుండగా.. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. ఇప్పటికే సదరు వ్యాపారి మీద పలుమార్లు పోలీసులు కేసు నమోదు చేసి..జైలుకు పంపినా.. మళ్లీ అక్రమ బియ్యం దందా కొనసాగిస్తున్నాడు. 120 క్వింటాళ్ల పీడీఎస్ నూకలను, డీసీఎంను సీజ్ చేసి పోతుగంటి శ్రీనివాస్, పోతుగంటి రామకృష్ణ అనే వ్యక్తులపై మిర్యాలగూడ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
మిర్యాలగూడలో 120 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం - నల్గొండ వార్తలు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే అక్రమ బియ్యం తరలింపుపై పలువురిపై కేసులు నమోదు చేసినా.. ఇంకా పీడీఎస్ బియ్యం దందా జోరుగా సాగుతోంది.
మిర్యాలగూడలో పీడీఎస్ బియ్యం పట్టుకున్న పోలీసులు