తెరాసతోనే అభివృద్ధి సాధ్యమని మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ఉద్ధాటించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా... తెరాస అభ్యర్థి నోముల భగత్‌తో పాటు గుర్రంపోడు మండలంలోని పిట్టల గూడెం, చామలోని బావి, వట్టికొడు, తేనెపల్లి గ్రామాల్లో పర్యటించారు.
'జానారెడ్డితో ఒరిగేదేమీ లేదు.. తెరాసతోనే అభివృద్ధి సాధ్యం' - nagarjuna sagar by election campaign
నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తెరాస అభ్యర్థి నోముల భగత్ తరఫున ప్రచారం చేసేందుకు మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే... నియోజకవర్గానికి ఒరిగేదేమీలేదని... తెరాస అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపించాలని కోరుతున్నారు.
ministers participated in trs campaign at nagarjuna sagar
ఉపఎన్నికల్లో నోముల భగత్‌ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జానారెడ్డితో నియోజకవర్గానికి ఎలాంటి ఉపయోగంలేదని దుయ్యబట్టారు. ప్రచారంలో మంత్రుల వెంట ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.