పల్లెల్ని అభివృద్ధి బాట పట్టించడమే ప్రభుత్వ ధ్యేయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రామాల పురోభివృద్ధికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా... విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో జరిగిన సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నలకు బదులివ్వడం చర్చానీయాంశంగా మారింది.
చెత్త వేసిన వారికి జరిమానాలు విధించడం, పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారానే... గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయపడ్డారు. పల్లెలకు విరాళాలిచ్చే వారి పేర్లు, ఫొటోలను పంచాయతీ కార్యాలయాల్లో పెడితే... మిగతా వారికి ఆదర్శంగా ఉంటుందన్నారు. మేళ్లచెరువు సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... రైతుబంధు సాయం అందక పోవడం, ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని, ముందుగానే సమాచారం ఇవ్వాలని కోరగా... ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి జగదీశ్ రెడ్డి బదులిచ్చారు.
ఎమ్మెల్యే సోదరుడి దాతృత్వం...