నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంది. త్రిపురారం మండల కేంద్రంలో తెరాస అభ్యర్థి నోముల భగత్ తరఫున రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికులు మంత్రికి మేక పిల్లను బహుకరించి స్వాగతం పలికారు.
అన్ని వర్గాల అభివృద్ధికి తెరాస సర్కార్ కృషి : తలసాని - trs campaign for nagarjuna sagar by election
కుల వృత్తులు ప్రోత్సహించడంలో తెలంగాణ సర్కార్ ఎప్పుడూ ముందుంటుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నోముల భగత్ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.
నాగార్జునసాగర్, నోముల భగత్, తలసాని
తెలంగాణ సర్కార్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని మంత్రి తలసాని అన్నారు. కులవృత్తులను ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ప్రజలు తెరాస పార్టీకి ఓటు వేసి నోముల భగత్‌ను గెలిపించాలని కోరారు.
- ఇదీ చదవండి :చెరుకు ఫ్యాక్టరీని తెరిపించాలంటూ రైతుల ధర్నా